శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్‌పీ రైల్వే కోల్ సైడింగ్‌ను కేంద్ర రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్, కోల్) సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆది వారం సందర్శించారు. బెల్లంపల్లి రీజియన్ పర్యటనలో భాగంగా ఇక్కడి రైల్వే సైడింగ్‌ను తనిఖీ చేశారు. బొగ్గు రేకుల లోడింగ్ వేగవంతం చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీనివాస్ బొగ్గు రవాణా, రేకుల లోడింగ్‌కు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ, రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌వోటు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరి యా ఇంజినీర్ సురేష్, సీహెచ్‌పీ ఇన్‌చార్జి చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


