ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, వసతి కల్పించేందుకు ఆదివా రం అర్హత పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామ ని కుమురంభీం స్టడీ సర్కిల్ పాలక మండలి సభ్యులు రాము తెలిపారు. కానిస్టేబుల్, ఫా రెస్టు బీట్ అధికారి, ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు ఈ అర్హత పరీక్ష నిర్వహించగా, 106 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 50 మందిని ఎంపిక చేసి ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఇందురావు, రఘు, జుగాదిరావు, నిర్వాహకులు ఊశన్న, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


