వసతి గృహాల్లో సమస్యలపై సర్వే | - | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో సమస్యలపై సర్వే

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

వాంకిడి: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యాయన సర్వే చేపడుతున్న ట్లు కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దిన్‌కర్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆదివారం సందర్శించా రు. విద్యార్థులు సమస్యలు తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో ఎస్సీ, బీసీ వి ద్యార్థులకు వసతి కల్పిస్తున్నారని తెలిపారు. ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని, ఆర్వో ప్లాంట్‌ లేక విద్యార్థులు బోర్‌ నీళ్లే తాగుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు నూతన భవనం నిర్మించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement