ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో తొలి ఏకాదశి పర్వది నాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున పట్టణంలోని వైష్ణవాలయాలతోపాటు ఇత ర ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఉద యం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. పాండురంగ నామస్మరణ తో ఆలయాలు మారుమోగాయి. జిల్లా కేంద్రంలో ని పండరినాథ ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు అనంత్ ఆచార్య ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, అభిషేకం, సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం భజనలు చేస్తూ భక్తి పారవశ్యంతో నిండిపోయారు. బాలేశ్వర, శివకేశవ, కేశవనాథ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేశవనాథ ఆలయంలో భక్తులు సామూహిక హరేరామ పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజనలు చేశారు. సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో 24 గంటల పాటు ఎక్కాహం నిర్వహించారు.


