వంటకు సరుకులు భారం | - | Sakshi
Sakshi News home page

వంటకు సరుకులు భారం

Jul 26 2026 2:20 AM | Updated on Jul 26 2026 2:20 AM

ధరలు పెరుగుతున్నా పెరగని చెల్లింపులు అప్పులు చేసి విద్యార్థులకు గుడ్లు అందజేస్తున్న నిర్వాహకులు సకాలంలో బిల్లులు రాక తిప్పలు

కాగజ్‌నగర్‌టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా సరుకులు, గుడ్డు ధరలు పెరిగినా పాత రేట్‌తోనే బిల్లులు చెల్లిస్తుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వారానికి ఒక రోజు ఇచ్చే గుడ్డును ఇప్పుడు మూడు రోజులకు పెంచారు. కానీ ప్రభుత్వం గుడ్డుకు రూ.6 మాత్రమే ఇస్తుండగా మార్కెట్‌లో రూ.9.10గా ఉంది. మిగిలిన రూ.3.10లు నిర్వాహకులే భరించాల్సి వస్తోంది. పైగా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలకు అప్పులు చేసి భోజనం పెడుతున్నామని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 540, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నారు. ఈ పాఠశాలల్లో 39వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. గుడ్డు, ఇతర సరుకుల ధరలు పెరిగినా వారికి చెల్లించే బిల్లులు మాత్రం పెరగడం లేదని, అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్నట్లు ప్రభుత్వమే గుడ్డు, సరుకులు పంపిణీ చేయాలని లేదంటే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని వారు కోరుతున్నారు.

మధ్యాహ్న భోజనం ధరలు ఇలా (ఒక్కొక్కరికి ఒక్కరోజుకు)..

ప్రభుత్వం దృష్టికి..

మెనూ ప్రకారం గుడ్డు వారానికి మూడు సార్లు అందించాలి. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారు. బిల్లులు పెంచే విషయం ప్రభుత్వం పరిధిలోని అంశం. ప్రభుత్వం దృష్టికి నిర్వాహకుల సమస్యను తీసుకెళ్తాం.

– సచ్చిదానంద చారి, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement