యువత పోరాటంతోనే కేంద్ర మంత్రి రాజీనామా | - | Sakshi
Sakshi News home page

యువత పోరాటంతోనే కేంద్ర మంత్రి రాజీనామా

Jul 26 2026 2:20 AM | Updated on Jul 26 2026 2:20 AM

ఆసిఫాబాద్‌: విద్యార్థులు, యువత సాగించిన పోరాటం వల్లనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విద్యార్థుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అబ్దుల్లా, డీసీసీ కార్యవర్గ సభ్యు లు మల్లేష్‌, భీమ్‌రావు, తారిక్‌, శంకర్‌, రాపర్తి మురళీ, మీర్‌ కాసిఫ్‌, ఇమ్రాన్‌, తిరుపతి, షఫి, శైలజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement