కెరమెరి(జైనూర్): ఇరువర్గాల మధ్య రాజీ ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని డీఎల్‌ఎస్‌ఏ (డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) సెక్రటరీ బీ. సంకేత్ మిత్ర పేర్కొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మితో కలిసి శనివారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గృహ హింస చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ తీర్పే అంతిమ తీర్పని పేర్కొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి మాట్లాడుతూ గృహ హింస చట్టం మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు తెచ్చిన చట్ట మన్నారు. బాధితులకు రక్షణ, నివాసం హక్కు, ఆర్థిక సహాయం అందించడానికి వీలు కల్పిస్తుంద ని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, సర్పంచ్ కొడొప ప్రకాశ్, మోతుబాయి తదితరులున్నారు.


