బాధిత కుటుంబాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు భరోసా

Jul 26 2026 2:20 AM | Updated on Jul 26 2026 2:20 AM

● విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ● డివిజన్‌లో రూ.16లక్షల 60వేల నష్టపరిహారం అందజేత ● కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ గ్రామానికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ రాములు (43) తన వాహనంలో కంకర లోడ్‌ డంప్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై నవంబర్‌ 25, 2025లో మృతి చెందాడు. కాగా విద్యుత్‌ శాఖ అధికారులు ఆయన భార్య చిలుకమ్మకు రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును ఇటీవల అందజేశారు. ● సెప్టెంబర్‌ 18న దహెగాం మండలం పీకలగుండం(చర్చిగూడ)కు చెందిన రైతు గోమాస పోశం(60) భార్య లచ్చుబాయితో కలిసి పొలానికి వెళ్లాడు. మోటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లచ్చుబాయికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ● సిర్పూర్‌(టి) మండలంలోని లోనవెల్లికి చెందిన టేకుల సురేశ్‌కు చెందిన ఆవు జనవరి 14, 2025 న విద్యుత్‌షాక్‌ తగిలి మృతి చెందగా యజమానికి రూ.80వేల చెక్కు అందజేశారు. అలాగే పారిగాంకు చెందిన నర్లె మురళీధర్‌కు చెందిన ఎద్దు మృతి చెందగా రూ.40వేలు, లక్ష్మిపూర్‌కు చెందిన గంట శ్రీనివాస్‌ మేక మృతి చెందగా అతనికి రూ.7వేలు, ఎల్కపల్లికి చెందిన నికోరే భీమయ్యకు చెందిన ఎద్దు విద్యుత్‌షాక్‌ తగిలి మృతి చెందగా అతనికి రూ. 40 వేలు, చెడ్వాయికి చెందిన ఎన్నంపల్లి ప్రకాశ్‌కు చెందిన గేదె మృతి చెందగా, రూ.40వేలు, కొండపల్లికి చెందిన నికోడె శ్రీనివాస్‌కు చెందిన ఎద్దు మృతి చెందగా రూ.40వేల చెక్కు అందజేశారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు, పశువుల యజమానులకు విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 2024 నుంచి 2025 డిసెంబర్‌ వరకు రూ.16 లక్షల 60 వేల నష్టపరిహారాన్ని అందించారు.

ఇటీవల బాధితులకు అందించిన

నష్టపరిహారం వివరాలు..

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు, పశువుల యజమానులకు విద్యుత్‌ శాఖ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తున్నాం. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహార చెక్కులు అందజేశాం.

– ఇమ్రాన్‌ అహ్మద్‌,

అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌, కాగజ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement