రాష్ట్రస్థాయి పోటీల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు వుషూలో 14 పతకాలు కై వసం వెయిట్‌లిఫ్టింగ్‌లో మస్కాపూర్ విద్యార్థినికి 5వ స్థానం
ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మ స్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.విజ్ఞత ఈనెల 12న సూ ర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన అస్మిత్ ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 58 కిలోల విభాగంలో పాల్గొని ఐదోస్థానంలో నిలిచింది. భైంసా డివిజన్‌కు చెందిన విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో అ త్యంత ప్రతిభ కనబర్చి 4 బంగారు, 3 వెండి, 7 కా ంస్య పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు.
స్ఫూర్తిదాయక విజయాలు
గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వరుసగా రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తుండటంతో నిర్మల్ జిల్లాలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. సరైన శిక్షణ, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి చేరగలరని ఈ విజయాలు మరోసారి నిరూపించాయి.
బంగారు పతకం విజేతలు
డి.రాజేశ్వరి, ఎ.అబ్దుల్ రహేమాన్, వాగ్మారే కరణ్, అక్షర
వెండి పతకం విజేతలు
శ్రీరాముల ప్రణీల్‌రాజ్, శ్రీరాముల కషిక, మహేందర్
కాంస్య పతకం విజేతలు
జంగం గంగాప్రసాద్, విష్ణుప్రియ, అభిమన్యు, అనన్య, రూమిక, మనస్విక, స్నేహ


