తిర్యాణి: మండల సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన తిర్యాణి మండల బంద్ సంపూర్ణమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఏళ్లుగా మండలంలో నిర్మాణానికి నోచుకోని రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మడావి గుణవంత్‌రావు, నాయకులు వెడ్మ భగవంత్‌రావు, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, తోట లచ్చన్న, శంకర్‌గౌడ్, జుంగోని లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


