జిల్లాను అగ్రగామిగా నిలపాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అగ్రగామిగా నిలపాలి

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంచి ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణలో జిల్లాను ఆగ్రగామిగా నిలపాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్‌స్పైర్‌ మానక్‌పై సైన్స్‌ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో శాసీ్త్రయ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను నమోదు చేయాలన్నారు. ప్రతీ స్కూల్‌ నుంచి ఐదు ప్రాజెక్టులను నమోదయ్యేలా సంబంధిత ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌, ఎంఈవో సుభాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement