పకడ్బందీగా ‘ఎస్‌ఐఆర్‌’ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘ఎస్‌ఐఆర్‌’ నిర్వహించాలి

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం ఆర్డీవో సీహెచ్‌.కృష్ణయ్యతో కలిసి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్‌ ఓట్ల గుర్తింపు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల సవరణ వంటి ప్రక్రియలను పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతీ బీఎల్‌వో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతీ దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కౌన్సిలర్లు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement