విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలుర మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశా రు. మౌలిక వసతులు, విద్య బోధన, వంట తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సా మర్థ్యాలు తెలుసుకున్నారు. డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణతోనే కాలుష్య నివారణ సాధ్యమవుతుందన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీఎం బుచ్చయ్య, ప్రిన్సిపాల్‌ శ్వేత పాల్గొన్నారు.

ఆగస్టు 25లోగా యూనిఫాం అందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆగస్టు 25లోగా పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచి వాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరిత అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో సచ్చిదానంద చారి, డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ఒక యూని ఫాం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వ్యాధుల నివారణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement