అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్ట ర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నదికి వరద వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల ని ఆదేశించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, వాగులు, వంతెనల వద్ద సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తహసీ ల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షించుకోవాలని సూ చించారు. సహాయక చర్యల్లో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నంబర్ 85008 44365కు సమాచా రం అందించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు.
మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఆసిఫాబాద్: జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు నాగపూర్ ప్రాంతీ య వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మె రుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవస రం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వ రద నిలిచే, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నదుల సమీపాలకు వెళ్లొద్దన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు స మీపంలో ఉండొద్దని సూచించారు. స్థానిక అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్
ఆసిఫాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. తెలంగాణ జీవనోపాధుల ప్రాజెక్టు కింద తిర్యాణి, లింగాపూర్ మండలాల్లో ఎంపికైన గ్రామాల్లోని అర్హులైన గిరిజనులకు మంజూరైన ఆసరా పింఛన్ పత్రాలను కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ యువరా జ్ మర్మాట్‌తో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవనోపాధుల ప్రాజెక్టు కింద అర్హులైన గిరిజనులకు వందశాతం పింఛన్లు, జాబ్‌కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖా తాలు అందిస్తామని తెలిపారు. గిరిజనుల ఆ రోగ్యం, చిన్న పిల్లలకు టీకాలు, ఆహారభద్ర త కార్డులు, నైపుణ్యత శిక్షణ, ఆర్థిక అక్షరాస్య త పెంపుదలకు కృషి చేయాలని ఆదేశించా రు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీ పీఎం రామకృష్ణ, సర్పంచులు పాల్గొన్నారు.


