నిషేధిత గడ్డిమందులు విక్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత గడ్డిమందులు విక్రయించొద్దు

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

చింతలమానెపల్లి: పారాక్వాట్‌, గ్లైఫోసెట్‌ వంటి నిషేధిత గడ్డి మందులు విక్రయించొద్దని డీఏవో వెంకట్‌ అన్నారు. మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్‌, ఎరువులు, విత్తనాల డీలర్లు, రైతులతో అత్యవసర పంటల ప్రణాళిక సమావేశం నిర్వహించారు. డీలర్లకు పలు సూచనలు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం– 2026 అత్యవసర ప్రణాళికపై రైతులతో చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో జూలై, ఆగస్టులో వర్షాలు బలహీనంగా ఉంటాయని, రైతులు తక్కువ నీటి అవసరం ఉండే పంటలను సాగు చేయాలన్నారు. వర్షాధార ప్రాంతాల్లో వరి సాగు చేయొద్దన్నారు. మినుములు, పెసర, కందులు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కొర్రలు, నువ్వులు, సన్‌ఫ్లవర్‌, కూరగాయలు, టమాట, పండ్లు సాగు చే యాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కార్తీషా, ఎఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement