కాగజ్‌నగర్‌రూరల్: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బెల్లంపల్లి – గడ్చిరోలి జాతీయ ర హదారి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. అలాగే హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ యాక్సిస్ కంట్రోల్డ్ హైవే నిర్మించాలన్నారు. గడ్చరోలి జిల్లాలో ఐరన్ ఓర్ గనులు పెద్దఎత్తున మొదలయ్యాయని, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ముడి ఇనుమును తరలించడంలో ఈ జాతీయ రహదారులు ఉపయోగపడతాయని తెలిపారు.


