ఆసిఫాబాద్‌రూరల్: నీట్ పేపర్ లీకేజీ ఘటన కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా శు క్రవారం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘా ల నాయకులు చేపట్టిన ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. వివిధ సంఘాల నాయకులు టీకానంద్, రాజ్‌కుమార్, సమీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
దాడిని ఖండించిన తెలంగాణ జన సమితి
నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల దాడిని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మధుకర్ బాధ్యుతలపై కఠిన చర్యలు తీ సుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


