ఉప సర్పంచులు, వార్డు సభ్యుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచులు, వార్డు సభ్యుల నిరసన

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: సమస్యలు పరిష్కరించా లని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ఉప సర్పంచులు, వార్డులు సభ్యులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఉప సర్పంచులకు నెలకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేల గౌరవ వేతనం చెల్లించా లని, జీవో 38ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉప సర్పంచుల సంతకాలు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను తప్పనిసరి గా ఆహ్వానించాలని ఉత్వర్వులు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు స భ్యుల పేర్లు కూడా చేర్చాలని కోరారు. ఉప సర్పంచులు దీపక్‌ ముండే, చిట్ల నారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement