ఆసిఫాబాద్‌రూరల్: శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను బడుల్లో సమర్థవంతంగా అమలు చే యాలని డీటీడీవో అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ టీచర్లు ఆధునిక బోధన పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యాసన విధానాలపై పట్టు పెంచుకోవాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లల్లో ఆలోచననా శక్తి, పరిశోధన దృక్పథం, శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, లక్ష్మయ్య, కోర్స్ డైరెక్టర్ రవీందర్, ఏటీడీవో చిరంజీవి, జీసీడీవో శకుంతల, డీఎస్‌వో షేకు, పీడీ మీనారెడ్డి పాల్గొన్నారు.


