ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులు కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో ఆసిఫా బాద్, మంచిర్యాల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో సమర్ధవంతంగా అమలు చే యాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, నాయకత్వ ల క్షణాలు పెంచాలని తెలిపారు. గిరిజన వి ద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, జీసీడీవో శకుంతల, లక్ష్మయ్య, కోర్సు డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో మంద మకరందు


