ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజా ఉద్యమాలను మరింత బ లోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కామ్రెడ్‌ అబ్బాస్‌ సూచించారు. పట్టణంలోని కిశోర్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఆది వారం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అబ్బాస్‌ హాజరై మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థి క విధానాలు కార్మికులు, రైతులు, పేద ప్రజల ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించా రు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత ఆర్థిక వ్య వస్థపై చూపుతున్న ప్రభావాన్ని పార్టీ కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణాన్ని పెంచుతూ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఎం జెండాను ఆవిష్కరించారు. శిక్షణ తరగతులకు ముంజం ఆనంద్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, కార్యవర్గ సభ్యులు దేవిక, కోట శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్‌ జాదవ్‌, రాజేందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement