ఆసిఫాబాద్‌అర్బన్: మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఐదో తెలంగాణ పోలీస్ గేమ్స్, స్పోర్ట్ మీట్– 2026లో జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చి 13 పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ నితిక పంత్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. వినయ్‌కుమార్, ఆర్.శ్రీకాంత్, చక్రవర్తి బంగారు పతకాలు సాధించగా, పూల్‌సింగ్ రెండు, అక్బర్ ఒక సిల్వర్ పతకం సాధించారు. లవన్‌కుమార్, వినేష్ రెండు చొప్పున కాంస్య పతకాలు, సాయికుమార్, పూల్‌సింగ్, సాయికిరణ్ ఒక్కో కాంస్య పతకంతో సత్తా చాటారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయస్థాయి పో టీల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.


