మానవ మనుగడకు అడవులు కీలకం | - | Sakshi
Sakshi News home page

మానవ మనుగడకు అడవులు కీలకం

Jul 26 2026 2:20 AM | Updated on Jul 26 2026 2:20 AM

సిర్పూర్‌(టి): మానవ మనుగడకు అడవులు ఎంతో కీలకమని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. శనివారం సిర్పూర్‌(టి) రేంజ్‌ పరిధిలోని దుబ్బగూడ ప్లాంటేషన్‌ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ పోడు వ్యవసాయం పేరుతో ధ్వంసం చేసిన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్లాంటేషన్‌లో మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌, సెక్షన్‌ అధికారి మోహన్‌రావ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాంటేషన్‌లో రక్షణ చర్యలు తీసుకోవాలి

చింతలమానెపల్లి: ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్లాంటేషన్లలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని డీఎఫ్‌వో సీహెచ్‌.బాలమణి అన్నారు. శనివారం ఖర్జెల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని బాబాపూర్‌ బీట్‌లోని ప్లాంటేషన్‌ను ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా అటవీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎఫ్‌ఎస్‌వో లాలాజీ, ఎఫ్‌బీవో ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement