నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

కాగజ్‌నగర్‌టౌన్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌: వినియోగదా రులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. పట్టణంలో శుక్రవారం జిల్లా విద్యుత్‌ శా ఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. డైరెక్టర్‌ మాట్లాడుతూ దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వినియోగదారులను ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. అనంతరం కాగజ్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. స్థానిక 132 కేవీ సబ్‌ స్టేషన్‌ను సందర్శించి సరఫరాపై ఆరాతీశారు. అనంతరం ఆసిఫాబాద్‌లో నూతనంగా నిర్మించిన 5 కిలోమీటర్ల 33 కేవీ లైన్‌ పనులను ప్రారంభించారు. ఈ లైన్‌తో వాంకిడి మండలానికి విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అటవీ ప్రాంతం గుండా తిర్యాణికి వెళ్లే 33 కేవీ లైన్‌పై చేపట్టిన కవర్డ్‌ కండక్టర్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీర్‌(ఆపరేషన్స్‌) అశోక్‌, ఎస్‌ఈ ఉత్తమ్‌కుమార్‌ జాడే, ఆసిఫాబాద్‌ డీఈ వీరేశ్‌, ఏడీఈ శ్రీనివాస్‌, ఏడీఈ ట్రాన్స్‌కో గోపాల్‌, ఎస్‌ఏఈ దేవిదాస్‌, ఏఈలు రవీందర్‌, ఫిరోజ్‌ఖాన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

33 కేవీ లైన్‌ను ప్రారంభిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement