ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు వద్ద వరదను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్ వేర్వేరుగా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నారు. లో లెవల్ వంతెనల వద్ద రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం, ఇతర వివరాలకు కంటోల్ రూం నంబర్ 85008 44365, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


