నిధుల దుర్వినియోగంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై విచారణ

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

కౌటాల: బెజ్జూర్‌ మండలం ఉట్‌ సారంగపల్లిలో నిధుల దుర్వినియోగంపై బుధవారం పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో హరిప్రసాద్‌ విచారణ చేపట్టారు. సర్పంచ్‌ శ్రీహరి, కార్యదర్శి ధర్మయ్యను అభివృద్ధికి వినియోగించి నిధుల వివరాలపై విచారించారు. డీఎల్‌పీవో మాట్లాడుతూ రికార్డులు, ఎంబీలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రత్యేక అధికారి పాలనలో నిధుల వినియోగంపై పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement