సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త ఘనత | - | Sakshi
Sakshi News home page

సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త ఘనత

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

రెబ్బెన: సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ సరికొత్త ఘనత సాధించిందని జనరల్‌ మేనేజర్‌ శ్రీరమేశ్‌ అన్నారు. భద్రత వారోత్సవాల్లో ఖైరిగూర ఓసీపీ నాలుగు బహుమతులు సాధించడంతో బుధవారం ఓసీపీ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే మొదటిసారి ఖైరిగూర ఓసీపీ నాలుగు పురస్కారాలు సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు. సేఫ్టీ విభాగంలో అత్యుత్తమ పనితీరు చూపి నాలుగు బహుమతులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ప్రాజెక్టు అధికారి నరేందర్‌, ఏరియా ఇంజినీర్లు వీరన్న, కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఫిట్‌ కార్యదర్శి మారం శ్రీనివాస్‌, మేనేజర్‌ శంకర్‌, రక్షణ అధికారి గౌతమ్‌ రాజేశ్వర్‌ రెడ్డి ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement