పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన పోస్టర్‌ను కలెక్టర్‌ కె.హరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. పోషణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 1నుంచి 7వరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, గర్భిణులు, బాలింతలతో సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కౌన్సిలింగ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, పోషణ్‌ అభియాన్‌ బృందం సభ్యులు, సీడీపీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement