కాగజ్‌నగర్/సిర్పూర్(టి): నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, వెంటనే తన పదవికి రాజీనామా చే యాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అలీ డి మాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి సిర్పూర్(టి)– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే బెజ్జూర్ మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాను న్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే కనీసం బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డా రు. దీనిపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బా బు సైతం స్పందించి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశ యువత కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహు ల్ గాంధీకి అందరూ మద్దతు తెలపాలని పిలుపుని చ్చారు. కేంద్ర మంత్రిని తొలగించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండ్ర జగ్గాగౌడ్, నాహిర్ అలీ, శ్రీవర్ధన్, బుస శంకర్, పెంటయ్య, సుధాకర్, విశ్వేశ్వర్, సామల రాజన్న తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
కౌటాల: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అలీ, ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విద్యార్థుల అరెస్ట్‌ను ఖండిస్తూ గురువారం కౌటాల మండల కేంద్రంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నికాడే గంగారాం, సర్పంచులు సంతోష్, రాంప్రసాద్, భీంరావు, చందు తదితరులు పాల్గొన్నారు.


