కలిస్తే బాల్య స్మృతులు నెమరువేసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కలిస్తే బాల్య స్మృతులు నెమరువేసుకుంటాం

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

ఆసిఫాబాద్‌: తొమ్మిది మంది స్కూల్‌ మేట్స్‌తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్న వయస్సులో ఏర్పడిన ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మాలో ఎవరికీ స్వార్థం అనేదే లేదు. మా మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండవు. అన్ని విషయాలు కలిసే డిస్కస్‌ చేస్తాం. ఒకరికొకరం అవసరమైన సలహాలు ఇచ్చుకుంటాం. అంతస్తు, హోదాతో తేడా లేకుండా కొనసాగుతున్న మా మైత్రి బంధం వెలకట్టలేనిది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నామో ఇప్పటికే అందరం కలిస్తే బాల్యంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్లా మారి సిల్లీ పనులు చేస్తాం. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఇప్పటి పిల్లలకు ముందు తరాలవారితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలోనే మిత్రులంటారు.

– కె.హరిత, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement