వాంకిడి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 29 ఆషాఢ పౌర్ణమి నుంచి అశ్విని పౌర్ణమి వరకు మూడు నెలలపాటు వర్షవాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమత సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బౌద్ధ మత గురువులు మూడు నెలలపాటు ఒకేచోట ఉండి ధర్మోపదేశం చేశారని, జ్ఞానం పొందడానికి ఈ మూడు నెలలు పవిత్రమైనవన్నారు. అంబేడ్కర్ రచించిన గ్రంథాలు, బౌద్ధంపై ఉన్న గ్రంథాలను మూడు నెలలపాటు పఠించాలని కోరారు. కార్యక్రమంలో వర్షవాస్ కమిటీ అధ్యక్షుడు దుర్గం శ్యాంరావు, ఎస్‌ఎస్‌డీ జిల్లా ఆర్గనైజర్ రోషన్, నాయకులు సెండె అన్నాజీ, నాగ్‌సేన్, రాజేంద్రప్రసాద్, అరుణ్, కిరణ్, భీంరావు, బుద్దాజీ తదితరులు పాల్గొన్నారు.


