జనగణన పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

Jul 26 2026 2:20 AM | Updated on Jul 26 2026 2:20 AM

● అదనపు కలెక్టర్‌ ఎం. డేవిడ్‌

ఆసిఫాబాద్‌: జనగణన హ్యాండ్‌ బుక్‌ తయారీ ప్రక్రి య పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. భారత జనగణన 2027లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామ, పట్టణ, డైరెక్టరీల వి వరాల సేకరణపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ భారత జనగణన –2027 జనగణన హ్యాండ్‌బుక్‌ తయారీ ప్రక్రియలో సేకరించే సమాచారం అత్యంత కచ్చితత్వంతో, నాణ్యతతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. డేటా సేకరణలో ఎటువంటి పొ రపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ 1951 జనగణన నుంచి నిరంతరం ప్రచురితమవుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల జనాభా, సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించే ప్రభుత్వ ప్రామాణిక గ్రంథంగా నిలుస్తోందన్నారు. మొబైల్‌ యాప్‌, వెబ్‌ పోర్టల్‌, అవసరమైతే భౌతిక షెడ్యూల్‌ ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని తెలిపారు. ఫీల్డ్‌ స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం సహాయ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గురువయ్య, జిల్లా కో ఆర్డినేటర్‌ కృష్ణయ్య, శిక్షకుడు అభిషేక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement