కెరమెరి: మండలంలోని రింగన్‌ఘాట్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీపీవో భిక్షపతిగౌడ్ తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. పాఠశాల వాతావరణం, బడి నిర్వహణపై హెచ్‌ఎం అజయ్‌కుమార్‌ను అభినందించారు. ఇంకుడు గుంత మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నమోదుపై ఆరా తీశారు. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. నూతన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. సర్పంచ్ మండాడి అనసూయ, పంచాయతీ కార్యదర్శి ప్రేంసాగర్ ఉన్నారు.


