చింతలమానెపల్లి: మండలంలో ఒకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రవీంద్రనగర్‌లో ఉంది. ఇక్కడ ఉదయం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే వైద్య సేవలందుతున్నాయి. కీలక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండగా ప్రస్తుతం కమ్యూనిటీ వైద్యాధికారి అజ్మీర రాజ్‌కుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. బెజ్జూర్ స్టాఫ్‌నర్స్ దుర్గ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా స్వప్నను బెజ్జూర్‌కు కేటాయించగా బుధవారం నుంచి తిరిగి ఇదే పీహెచ్‌సీకి కేటాయించారు. ప్రతిరోజూ సుమారుగా 60 నుంచి 70 మంది వరకు రోగులు వస్తుంటారు. మంగళవారం ఇన్‌చార్జి వైద్యాధికారి రాజ్‌కుమార్ అధికారికంగా జిల్లా కేంద్రానికి వెళ్లగా స్టాఫ్‌నర్స్ దుర్గ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో వైద్యాధికారి పోస్టు, స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎంలను అదనంగా కేటాయించాలని మండల వాసులు కోరుతున్నారు.


