ప్రకృతి సాగుపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుపై అవగాహన కల్పించాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పించాలని డీఏవో వెంకట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో మంగళవారం రెండోరోజూ వ్యవసాయశాఖ, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రసాయన మందుల వాడకం పెరిగిన నేపథ్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. విత్తన శుద్ధి, జీవామృతం, కంపోస్టు ఎరువుల వాడకంతో దిగుబడి పెరుగుతుందని తెలిపా రు. కార్యక్రమంలో టెక్నికల్‌ వ్యవసాయ అధికారి దీప్తి, వ్యవసాయ విస్తరణ అధికారి తాండవ కృష్ణ, శిక్షకులు రోహిణి ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement