నేటి నుంచి ‘చింతలమాదర’ సందర్శన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘చింతలమాదర’ సందర్శన

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

తిర్యాణి: మండలంలోని చింతలమాదర జలపాత సందర్శనకు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ఎఫ్‌డీవో అప్పయ్య తెలిపారు. మందగూడలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జలపాతానికి వచ్చే పర్యాటకుల నుంచి వసూలు చేసే మొత్తంలో 20 శాతం నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేయడానికి అటవీ అధికారులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఎఫ్‌డీవో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అటవీ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అటవీ శాఖతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తుంరం గోపాల్‌, గిన్నెధరి ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి సరోజని రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement