కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో చేరుకుని ప్లాట్‌ఫాం– 1, స్టేషన్ ఎదుట పార్కింగ్ పరిసరాలను పరిశీలించారు. అమృత్ భారత్ స్కీంలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు అనుకూలమైన పరిస్థితులపై ఆరా తీశారు. మూడో ప్లాట్‌ఫాంలో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు, పార్కింగ్, లిఫ్ట్, తదితర అంశాలను అధికారులతో చర్చించారు. డీసీ ఎం చరణ్‌దాస్, సీనియర్ డీవోఎం నరేందర్, అభిరాం, స్టేషన్ మేనేజర్ వివేకానంద, చీఫ్ క మర్షియల్ బుకింగ్ సూపరింటెండెంట్ భాస్కర్, ఆర్పీఎస్ ఎస్సై ప్రాచీదేవి పాల్గొన్నారు.
సిర్పూర్(టి): సిర్పూర్(టి) రైల్వేస్టేషన్‌ను శు క్రవారం రైల్వే డీఆర్‌ఎం గోపాల కృష్ణ తనిఖీ చేశారు. స్థానిక యువకులు సిర్పూర్(టి) స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కేటాయించాలని, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, నాగ్‌పూర్, హజ్నీ ప్యాసింజర్ రైలు నిలపాలని వినతిపత్రం అందించారు.


