వైద్యసేవలు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు మెరుగుపర్చాలి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌/కాగజ్‌నగర్‌టౌన్‌: ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో వైద్యారోగ్యశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు తక్షణమే భర్తీ చేయాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ మెడికల్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పాల్వాయి హరీశ్‌బాబు మా ట్లాడుతూ బెజ్జూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవ నం శిథిలావస్థకు చేరుకుందని, 2018లో శిలా ఫలకం వేసినా అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేపట్ట లేదన్నారు. పాత భవనాన్ని కూల్చివేసి నూతన సా మాజిక ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని కోరారు. బెజ్జూర్‌ మండలం సల్గుపల్లి, కాగజ్‌నగర్‌ మండలం వంజీరి గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement