కెరమెరి: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని గిరిజన సంక్షేమ అధికారి జాదవ్ అంబాజీ అన్నారు. మండలంలోని జోడేఘాట్, బాబేఝరి ఆశ్రమ ఉన్నత పాఠశాలలను బుధవారం ఏటీడీఏ శ్రీనివాస్‌తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, స్టోర్, వంట గదులు పరిశీలించారు. విద్యార్థులతో బోర్డుపై తెలుగు, ఇంగ్లిష్ పదాలు రాయించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అంతకు ముందు జోడేఘాట్‌లోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. గ్రామ పటేల్ రాజేశ్వర్, హెచ్‌ఎంలు మోతీరాం, జంగు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.


