కాగజ్‌నగర్‌టౌన్: ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 63వ రోజుకు చేరాయి. మంగళవారం కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల రి బ్బన్లు ధరించి విధులకు హాజరై నిరసన తెలి పారు. మజ్దూర్ యూనియన్ ఉపాధ్యక్షుడు ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ యాజమాన్యం కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ రాములు, వివిధ కార్మిక సంఘాల నాయకులు షబ్బీర్, శ్రీనివాస్, రాజేశ్, నబి, రాజమోగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


