ఆసిఫాబాద్: నా శ్రీమతి కూడా నా ఫ్రెండే. మేం కలి సే గ్రూప్స్‌న కు ప్రిపేరయ్యాం. చిన్నప్పటి ఫ్రెండ్స్‌తోపాటు ఉద్యోగరీత్యా వివిధ చోట్ల పని చేయడంతో నాకు విలువైన స్నేహితులు దొరికారు. ఈ విషయంలో నేను చాలా అదృష్ట వంతుడిని. ఆర్టీసీలో పని చేస్తున్నప్పుడు డ్రైవర్స్ స్నేహితులయ్యారు. ఇప్పటికీ నన్ను ఎరా.. అని పిలుస్తారు. మా స్నేహానికి హోదాలు, కులమతాలు లేవు. నేను ఢిల్లీలో పని చేసినప్పుడు కూడా నాకు మళయాలీలు, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్సయ్యా రు. వీరిలో క్రిస్టియన్స్, ముస్లింలూ ఉన్నారు. వాట్సప్ పుణ్యమాని రోజూ పలకరించుకుంటాం. ౖఏడాదికి ఒకసారైనా కలిసి పార్టీ చేసుకుంటాం. నా దృష్టిలో స్నేహితులు అంటే జీవితంలో అన్నింటికన్నా విలువైనవారు.
– లోకేశ్వర్‌రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్


