ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరుకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరుకు కృషి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాకు నూతన 10+2 కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరుకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవి అన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి పదోన్నతిపై వచ్చిన శారదాదేవి సోమవారం జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌ న్యాయస్థాన భవన సముదాయంలో జిల్లా జడ్జిని వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించారు. ఆసిఫాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆరు నెలలుగా ఇన్‌చార్జి జిల్లా జడ్జిగా సేవలందించిన మంచిర్యాల ప్రథమ జిల్లా జడ్జి వీరయ్యకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం నూతన జడ్జి శారదాదేవి, ఇన్‌చార్జి జడ్జి వీరయ్యను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సాంకేత్‌ మిత్ర, జూనియర్‌ సివిల్‌ జడ్జి అనంతలక్ష్మి, సీనియర్‌ న్యాయవాదులు సురేశ్‌, రవీందర్‌, నరహరి, వెంకటేశ్వర్లు, జగన్మోహన్‌రావ్‌, రవీందర్‌రెడ్డి, జూనియర్‌ న్యాయవాదులు, గుమస్తాల సంఘం ప్రతినిధులు శివచందు, మక్రం ఖాన్‌, సిడాం శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement