వాంకిడి: ఉపాధ్యాయులు రాక వి ద్యార్థులు చదువుకు దూరమవుతు న్న తీరుపై గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘బడికి తాళం.. చదువుకు దూరం’ అనే కథనానికి అధికారులు స్పందించారు. వాంకిడి మండలంలోని సల్పలగూడ టీడబ్ల్యూపీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న పెందుర్ చరణ్ దాస్, లింబుగూడ టీడబ్ల్యూపీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ దివ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కాంప్లెక్స్ హెచ్‌ఎం నారాయణ మూర్తి తెలిపారు. ఏసీఎంవో ఉద్దవ్ ఆదేశాల మేరకు కాంప్లెక్స్ హెచ్‌ఎం నారాయణ మూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా డీటీడీవో జాదవ్ అంబాజీ సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
మన్నెగూడ బడికి టీచర్..
మన్నెగూడ ఎంపీపీఎస్ టీచర్ సెలవుల్లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా వేరే టీచర్‌ను కేటాయించలేదు. విద్యార్థలు పాఠాలు నష్టపోతున్నారనే విషయాన్ని కథనంలో ప్రస్తావించగా.. విద్యాశాఖ అధికారులు స్పందించి ఒక టీచర్‌ను డిప్యూటేషన్‌పై ఆ పాఠశాలకు కేటాయించారు. గురువారం ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించారు.
ఎఫెక్ట్


