కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతోపాటు ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద బుధవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్‌ ప్రశ్నపత్రాలను రూ.కోట్లకు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, నాయకులు గంగరాం, బాలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement