కెరమెరి: విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు విద్యార్థులు నిర్దేషిత సామర్థ్యాలను సాధించలేకపోతున్నా రు. దీంతో వెనుకబడిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రభుత్వం రెమిడియల్ టీచింగ్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 2, 3, 4, 5 తరగతుల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి చదవడం, రా యడం, గణిత సామర్థ్యాలను బలోపేతం చేయాల నే లక్ష్యంతో విద్యాశాఖ చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు రెమిడియల్ టీచింగ్‌పై అన్ని మండలాల్లో ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గత నెల 29 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించింది. రెండు దఫాల్లో శిక్షణ ఇవ్వనుండగా ఇప్పటికే మొదటి విడ త శిక్షణ తరగతులు ముగిశాయి. రెండో విడత శిక్షణ తరగతులు ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించనుంది. శిక్షణలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే పద్ధతులు, లెర్నింగ్ గ్యాప్‌ల గుర్తింపు, చిన్న బృందాల బోధన, ఆటలు, కథలు, చిత్రాలు, బోధనోపకరణాల వినియోగం, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, నిరంతర మూల్యాంకనం, పురోగతి నమోదు లాంటి అంశాలను మాస్టర్ ట్రైనర్లు వివరిస్తున్నారు. ప్రతీ విద్యార్థి అవసరానికి అనుగుణంగా బోధించడం ద్వారా అభ్యాస ఫలితాలు మెరుగుపడతాయని సూచిస్తున్నారు. ఐదు స్టెప్పుల్లో విద్యార్థులకు బోధించాలని చెబుతున్నారు.
రెమిడియల్ టీచింగ్‌లో..
అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలి. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో వారి లోపాలను గుర్తించాలి. విద్యార్థి స్థాయికి అ నుగుణంగా ప్రత్యేక కార్యాచరణ, నిరంతర మూ ల్యాంకనం ద్వారా పురోగతి అంచనా వేయాలి. ఎఫ్ ఎల్‌ఎన్ లక్ష్యాల సాధనకు కీలకమైన బోధన విధా నం అమలు చేయాలి. విద్యార్థుల అభ్యసన స్థాయి ని పరీక్షల ద్వారా గుర్తించాలి. చిన్న, చిన్న గ్రూపులుగా లేదా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా బోధించాలి. సులభమైన ఉదాహరణలు, ఆటలు, చిత్రాలు, కార్యకలాపాల ద్వారా పాఠ్యాంశాలు నేర్పించాలి. తరచూ మూల్యాంకనం చేసి పురోగతిని పరిశీలించాలి. అభ్యసన సామర్థ్యాలను పెంచాలి.
వెనుకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్
తరగతి గదిలో కేవలం పాఠ్యపుస్తకానికి పరిమి తం కాకుండా బోధన పద్ధతులను అనుసరించా లని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని, ఉపాధ్యాయులకు మండల రిసోర్స పర్సన్లు శిక్షణలోసూచిస్తున్నారు. ముఖ్యంగా తె లుగు, ఆంగ్లంలో చదవడం, పదాల నిర్మాణం, వాక్యాల రచన, గణితంలో సంఖ్యా పరిజ్ఞానం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం లాంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం పాఠశాలల్లో రెమి డియల్ తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రతీరోజు బడిలో 3గంటల నుంచి 4వరకు రెమిడియల్ తరగతులు బోధించి వెనుబడి న విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలు సాధించడంలో రెమిడియల్ టీచింగ్ కీలక పాత్ర పోసిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


