ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజల ఓటుహక్కును కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌లతో కలిసి మాట్లాడారు. జిల్లాలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా 4,07,621 మంది డిజిటలైజేషన్ పూర్తయ్యిందని తెలిపారు. కార్యకర్తలను బీఎల్‌ఏలుగా నియమించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇరుకుల మంగ, విశ్వనాథ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్, మండల అధ్యక్షుడు మురళి, పట్టణ అధ్యక్షుడు హస్మి తదితరులు పాల్గొన్నారు.


