నాణ్యమైన బోధన అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన బోధన అందించాలి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, బోధన అభ్యసన ప్రక్రియ, ప్యా నెల్‌ ఇన్‌స్పెక్షన్లను సమర్ధవంతంగా నిర్వహించాల ని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ సూచించా రు. కలెక్టరేట్‌లో శనివారం హెచ్‌ఎం, సబ్జెక్టు టీచ ర్లు, ప్యానెల్‌ టీం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్లు కేవలం తనిఖీలకే పరిమితం చేయకుండా బోధనను మెరుగుపరిచే మార్గదర్శక ప్రక్రియ అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల అభ్యస న స్థాయి, బోధన, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల నోటుబుక్స్‌, మూల్యాంకన విధా నం, హాజరు, పరిశుభ్రత, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానె ల్‌ వినియోగం, ప్రయోగశాల వినియోగం, మౌలిక వసతులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచేలా నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన అందించాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద, ఎస్వో శ్రీనివాస్‌, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement