ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు బీజీపీ అధిష్టానం స్పందించకపోవడం దురదృష్టకరమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్నేహం పేరుతో మైనర్ బాలికకు అన్యాయం చేసినా బీజేపీ నాయకులు మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఉబెద్ బిన్ మహియా, భీంరావు, నాయకులు విజయ్‌కుమార్, తిరుపతి, కాంతారావు, సుజాయిత్ ఖాన్, దిలీప్, సంతోష్, కామేశ్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


