దహెగాం: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. మండల కేంద్రంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆరబెట్టి న తాలు లేని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు, గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేసి ఎప్పటికప్పు డు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత ఉన్నందున కేంద్రం వద్ద నీ డ, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. జి ల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, ఏఈవో ఆదిత్య ఉన్నారు.
ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన
దహెగాం మండలంలోని ఐనం గ్రామంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ, వ్యవసాయశాఖ, ఆత్మ సౌజ న్యంతో ఆయిల్‌పాం సాగు, సాగులో మెళకువలు, లాభాలపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ హరిత హాజరై మాట్లాడారు. ఆయిల్‌పాం సాగు ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని, రైతులు సాగుకు ముందుకురావాలని సూచించారు. 90 శాతం సబ్సిడీపై మొక్కలు అందించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ వెల్ములే ప్రశాంత్, జిల్లా ఉద్యానవన అధికారి నదీం, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, డీసీవో మోహన్, ఏడీఏ మనోహర్, మాట్రిక్ సీఈవో ఉదయ్‌కుమార్, ఉద్యానవనశాఖ అఽధికారి సుప్రజ, ఏవో రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ బలోపేతంపై సమీక్ష
ఆసిఫాబాద్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం, బలోపేతంపై కలెక్టర్ హరి త సమీక్ష నిర్వహించారు. సభ్యత్వం పెంచి సొసైటీ ని బలోపేతం చేయాలని కోరారు. జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు, ఉపాధ్యాయులు, ఉ ద్యోగులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇండియ న్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మండల స్థా యి అధికారులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సంబంధిత శాఖల అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


