పేటెంట్‌ రావడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

పేటెంట్‌ రావడం అభినందనీయం

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన విద్యార్థిని అప్ప మమత తయారు చేసిన పార్కింగ్‌ నిర్వహణ ప్రాజెక్టుకు అధికారిక పేటెంట్‌ రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణంలో విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయమన్నారు. విద్యార్థినికి సహకరించిన ఉపాధ్యాయులు మౌల్కర్‌ కేశవ్‌, జిల్లా సైన్స్‌ అధికారి కటుకం మధుకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ భాస్కర్‌, జాగరి రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement